Tollywood: కరోనాతో కన్నుమూసిన సీనియర్ నటి కవిత కుమారుడు సంజయ్ రూప్

Kavithas son dies of Covid  husband in hospital
  • కవిత ఇంట్లో విషాదం నింపిన కరోనా
  • కరోనాతో పోరాడుతున్న కవిత భర్త
  • కుమారుడి మృతికి సినీ ప్రముఖుల సంతాపం
టాలీవుడ్ సీనియర్ నటి కవిత ఇంట్లో కరోనా మహమ్మారి విషాదం నింపింది. ఆమె తనయుడు  సంజయ్ రూప్ కొవిడ్‌తో మృతి చెందాడు. ఇటీవల కరోనా వైరస్ బారినపడి సంజయ్ హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. అయితే, పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచాడు.

ఆమె భర్త దశరథరాజు కూడా కరోనా బారినపడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగంలోకి ప్రవేశించిన కవిత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించింది. సంజయ్ రూప్ మృతికి పలు సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలిపారు.
Tollywood
Actress
Kavitha
Sanjay Roop
Tamil Nadu

More Telugu News