Shiv Sena: ఆదిత్య థాకరే పుట్టిన రోజును పురస్కరించుకుని రూపాయికే పెట్రోలు.. బారులు తీరిన వాహనదారులు

Shiv Sena to distribute petrol at Rs 1 per litre in Dombivli

  • డోంబివిలిలో రూపాయికే లీటరు పెట్రోలు పంపిణీ
  • కిలోమీటర్ల కొద్దీ బారులు తీరిన వాహనాలు
  • రూ.50కే పెట్రోలు పంపిణీ చేసిన మరో నేత
  • రెండు గంటలపాటు పెట్రోలు అందించిన వైనం

మహారాష్ట్ర పర్యావరణ మంత్రి ఆదిత్య థాకరే పుట్టిన రోజును పురస్కరించుకుని శివసేన మద్దతుదారులు డోంబివిలిలో రూపాయికే లీటరు పెట్రోలును పంపిణీ చేశారు. డోంబివిలి ఎంఐడీసీ ప్రాంతంలోని ఉస్మా పెట్రోలు పంపు వద్ద డోంబివిలి యువసేన నేత యోగేశ్ మహాత్రే వాహనదారులకు రూపాయికే పెట్రోలు అందించారు. నిన్న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రెండు గంటలపాటు ఈ కార్యక్రమం జరిగింది. పెట్రోలు పోయించుకునేందుకు జనం రోడ్డుపై క్యూకట్టారు. అలాగే, అంబర్‌నాథ్‌లో శివసేన నేత అరవింద్ వాలేకర్ కూడా 50 రూపాయలకే పెట్రోలును పంపిణీ చేశారు. విమ్కో నాకా పెట్రోలు పంపులో ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు పెట్రోలు పంపిణీ చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News