KIA: తెలంగాణలో అదనపు కలెక్టర్లకు కియా కార్లు... పరిశీలించిన సీఎం కేసీఆర్

- ఒక్కో కారు విలువ రూ.24.95 లక్షలు!
- ప్రగతి భవన్ లో కొలువుదీరిన కార్లు
- కార్ల వివరాలు తెలుసుకున్న సీఎం కేసీఆర్
- జెండా ఊపి ప్రారంభించిన మంత్రి పువ్వాడ
- బీజేపీ ఆగ్రహం!
తెలంగాణ జిల్లాల అదనపు కలెక్టర్ల అధికారిక వాహనాలుగా కియా కార్లు రంగప్రవేశం చేయనున్నాయి. జిల్లాల అడిషనల్ కలెక్టర్ల కోసం ప్రభుత్వం 32 కియా కార్లను కొనుగోలు చేసింది. ఈ కార్లను సీఎం కేసీఆర్ ఇవాళ ప్రగతి భవన్ లో పరిశీలించారు. అధికారులను అడిగి వాటి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం, ఈ కార్లను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ప్రగతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్ కూడా పాల్గొన్నారు.

