: సీఎం కిరణ్ కు హరీశ్ రావు లేఖ
రాష్ట్రంలో మండిపోతున్న ఎండలను ప్రకృతి విపత్తుగా ప్రకటించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈమేరకు హరీశ్ రావు నేడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఓ లేఖ రాశారు. ఉష్ణోగ్రతలు ప్రమాదకరస్థాయికి చేరిన దృష్ట్యా సింగరేణి కార్మికులకు ఓ వారం పాటు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని తన లేఖలో కోరారు. వడదెబ్బ ప్రమాదం విద్యార్థుల పాలిట ప్రాణాంతకంగా పరిణమిస్తున్న నేపథ్యంలో పరీక్షలన్నీ వాయిదా వేయాలని సూచించారు. అంతేగాకుండా, భానుడి ప్రతాపానికి బలైన వారికి రూ.2 లక్షల పరిహారం చెల్లించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.