Assom: ప్రాంతీయ పార్టీల్లోనే పోటీ.. అవి బీజేపీని ఢీకొట్టలేవు: అసోం సీఎం

Assom CM Himanta Says Regional Parites Cant be Alternative

  • జాతీయ రాజకీయాలకు ప్రత్యామ్నాయం కావు
  • కాంగ్రెస్ ముక్త్ భారత్ త్వరలోనే సాకారం
  • దేశాన్ని కాపాడే వారికే ప్రజలు ఓటేస్తారు

ఇటీవలి కాలంలో ప్రాంతీయ పార్టీలే జాతీయ రాజకీయాల్లో కీలకమవుతాయన్న ప్రకటనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీకి ప్రత్యామ్నాయం అవుతాయన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. అయితే, వాటన్నింటినీ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కొట్టిపారేశారు. ప్రాంతీయ పార్టీల్లో అంతర్గత ‘పోటీ’ ఎక్కువగా ఉందని, బీజేపీని ఢీకొట్టలేవని ఆయన అన్నారు. ఓ ఆంగ్ల వార్తా సంస్థ నిర్వహించిన ఈ– అడ్డా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశంలో కాంగ్రెస్ ఏ మాత్రమూ ప్రత్యామ్నాయం కాబోదని, ప్రాంతీయ పార్టీలే అవుతాయంటూ చాలా మంది వామపక్ష ఉదారవాదులు చెబుతూ వస్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ముక్త భారత్ అతి త్వరలోనే సాకారమవబోతోందన్నారు. అయితే, ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల గురించి చర్చ జరుగుతున్నా అది సాధ్యం కాదన్నారు. ఉదాహరణకు బెంగాల్, బీహార్ లు కలవలేవని, అదే విధంగా బెంగాల్, అసోంలకూ పొంతన కుదరదని అన్నారు. కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఏకమైనా బీజేపీ హవాను తగ్గించలేవన్నారు.

అక్కడక్కడా లీడర్లు ఎదిగినా.. జాతీయ రాజకీయాలకు వచ్చే సరికి మాత్రం వారు ప్రభావం చూపించలేరని అన్నారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని ఎల్లప్పుడూ రక్షించే వారికే ప్రజలు ఓటేస్తారని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News