Kriti Sanan: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Kriti Sanan wishes to work with Mahesh again
  • మహేశ్ తో మరో సినిమా అంటున్న కృతి!
  • రవితేజ సినిమాను రీమేక్ చేస్తున్న సల్మాన్
  • వీవీ వినాయక్ తో బెల్లంకొండ మరొకటి  
*  గతంలో మహేశ్ నటించిన '1 నేనొక్కడినే' సినిమాలో కథానాయికగా పరిచయమైన బాలీవుడ్ భామ కృతి సనన్ ఇప్పుడు ప్రభాస్ కు జంటగా 'ఆదిపురుష్' సినిమాలో నటిస్తున్న సంగతి విదితమే. తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్విట్టర్లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ, మహేశ్ బాబుతో మరో సినిమా చేయాలని ఉందని పేర్కొంది. 'తను నా మొట్టమొదటి కోస్టార్.. ఎంతో అద్భుతమైన వ్యక్తి.. ఆయనతో మరోసారి నటిస్తానని ఆశిస్తున్నాను' అంటూ చెప్పింది.
*  గతంలో రవితేజ నటించిన 'కిక్' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి హిట్ కొట్టిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్.. ఇప్పుడు రవితేజ నటిస్తున్న మరో చిత్రాన్ని కూడా రీమేక్ చేయనున్నాడు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న 'ఖిలాడి' చిత్రం కథ బాగా నచ్చడంతో నిర్మాణంలో ఉండగానే ఈ చిత్రం రీమేక్ హక్కులను సల్మాన్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
*  'ఛత్రపతి' చిత్రం హిందీ రీమేక్ ద్వారా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ కి పరిచయం కానున్నాడు. వీవీ వినాయక్ దర్శకత్వం వహించే ఈ చిత్రం ప్రీప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. అయితే, ఈ లోగా తమిళ హిట్ చిత్రం 'కర్ణన్'ని బెల్లంకొండ తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. దీనికి దర్శకుడిగా వేరే పేర్లు వినిపించినప్పటికీ, తాజాగా వీవీ వినాయక్ ను ఎంచుకున్నట్టు సమాచారం.
Kriti Sanan
Mahesh Babu
Raviteja
Salman Khan

More Telugu News