Andhra Pradesh: ఏపీ కరోనా బులెటిన్.. 67 మంది మృతి
- నిన్నటితో పోలిస్తే నేడు పెరిగిన కరోనా కేసులు
- మొత్తంగా 8,766 కేసుల నమోదు
- అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,980 కేసులు
- విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 265 కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో నిన్న తగ్గినట్టు కనిపించిన కరోనా కేసులు నేడు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 8,766 కేసులు వెలుగుచూశాయి. 67 మంది మరణించారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 17,79,773కు పెరగ్గా, మరణాల సంఖ్య 11,696కు చేరుకుంది. ఈ మేరకు తాజాగా వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
దీని ప్రకారం, గడచిన 24 గంటల్లో 93,511 మందికి పరీక్షలు నిర్వహించారు. 12,292 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఈ మహమ్మారి కోరల నుంచి బయటపడిన వారి సంఖ్య 16,64,082కు పెరిగింది. రాష్ట్రంలో ఇంకా 1,03,995 కేసులు క్రియాశీలంగా ఉన్నాయి. తాజాగా, నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,980 కేసులు ఉండగా , విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 265 కేసులు వెలుగుచూశాయి.
.