Lakshadweep: లక్షద్వీప్‌లో కొనసాగుతున్న నిరసనలు..  సముద్రగర్భంలో ప్లకార్డులతో ఆందోళన

Lakshadweep Protests At Homes On Beaches and Under Sea

  • ప్రతిపాదిత కొత్త చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు
  • 12 గంటలపాటు నిరాహార దీక్ష
  • దుమ్మెత్తి పోస్తున్న కేరళ ప్రతిపక్ష పార్టీలు

లక్షద్వీప్‌లో ప్రతిపాదిత కొత్త చట్టాలకు వ్యతిరేకంగా లక్షద్వీప్, కేరళలో నిరసనలు కొనసాగుతున్నాయి. లక్షద్వీప్ పరిపాలనాధికారి (అడ్మినిస్ట్రేటర్) ప్రఫుల్ పటేల్‌ను తొలగించడంతోపాటు వివాదాస్పద ఎల్డీఏఆర్ బిల్లును ఉపసంహరించుకోవాలని ‘సేవ్ లక్షద్వీప్ ఫోరం’ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నిన్న భారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు. సముద్ర గర్భంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. 12 గంటలపాటు నిరాహార దీక్ష చేపట్టారు.

ప్రఫుల్ పటేల్‌కు వ్యతిరేకంగా కేరళ ప్రతిపక్ష పార్టీలు కూడా నిరసన గళం వినిపిస్తున్నాయి. లక్షద్వీప్‌లో ముస్లింలు ఎక్కువగా ఉన్న దీవుల్లో మద్యాన్ని, మాంసాన్ని నిషేధించారని, తీర ప్రాంతాల్లో జాలర్ల గుడిసెలను కూల్చివేయించారని ఆరోపించాయి. ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఎంపీలు కొచ్చిలోని లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News