: చదువుకున్న వారు చాలామందే ఉన్నార్లే!: ఫిక్సింగ్ నిందుతుడికి కోర్టు చురక
ఫిక్సింగ్ కు పాల్పడ్డట్టు ఆరోపణలెదుర్కొంటున్న దేశవాళీ క్రికెటర్ మనీష్ గుడేవార్ కు న్యాయస్థానం చురకలంటించింది. తాను విద్యాధికుడినని, తన కుటుంబం సమాజంలో గౌరవస్థానంలో ఉందని.. ఈ కారణాలతో తనకు స్పెషల్ సెల్ కేటాయించాలని మనీష్ కోర్టుకు విన్నవించుకున్నాడు. దీంతో, స్పందించిన ఢిల్లీ కోర్టు.. 'నీలాగే చదువుకున్న వారు జైల్లో చాలామందే ఉన్నారు' అని వ్యాఖ్యానిస్తూ, అతని పిటిషన్ ను తిరస్కరించింది. ఇక మనీష్ తో పాటు మరో నలుగురికి జూన్ 4 వరకు రిమాండ్ విధించింది. వీరిలో రాజస్థాన్ రాయల్స్ మాజీ ఆటగాడు అమిత్ సింగ్ కూడా ఉన్నాడు.