Samantha: సమంతపై గుణశేఖర్ ప్రశంసల జల్లు!

- 'శాకుంతలం' కోసం భారీ సెట్
- మే 10వ తేదీ వరకూ జరిగిన షూటింగు
- త్వరలో మళ్లీ సెట్స్ పైకి
- 50 శాతం చిత్రీకరణ పూర్తి
తెలుగులోని అగ్రదర్శకులలో గుణశేఖర్ ఒకరుగా కనిపిస్తారు. చారిత్రక .. పౌరాణిక చిత్రాలను అద్భుతంగా తెరకెక్కించిన అనుభవం గుణశేఖర్ సొంతం. ఈ సారి ఆయన తన కథా వస్తువుగా శకుంతల దుష్యంతుల ప్రేమకథను ఎంచుకున్నారు. ఈ కథలో ప్రకృతి - ప్రేమ రెండు కలిసి కనిపిస్తాయి. అందువలన ఈ ప్రేమ కావ్యాన్ని దృశ్యకావ్యంగా ఆవిష్కరించాలనే ఉద్దేశంతో గుణశేఖర్ రంగంలోకి దిగారు. శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటిస్తున్నారు. ఈ సినిమా కోసం భారీ సెట్లు వేశారు.