: మా బావ మహా ముదురు!: గురునాథ్ బామ్మర్ది


ఫిక్సింగ్ వ్యవహారంలో అరెస్టయిన గురునాథ్ మెయ్యప్పన్ గురించి అతని బావమరిది, బీసీసీఐ చీఫ్ ఎన్. శ్రీనివాసన్ కుమారుడు యోగేశ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన బావ పెద్ద ముదురు అంటున్నాడు. భారత బుకీలే కాదు, దుబాయ్ బుకీలతోనూ గురునాథ్ కు ప్రత్యేక సంబంధాలున్నాయని వెల్లడించాడు. ఐపీఎల్ తొలి సీజన్ నాటికి సాధారణ స్థాయిలో ఉన్న బావ బెట్టింగ్ దందా.. నేటికి బాగా విస్తరించిందని చెప్పాడు. అంతేగాకుండా, గురునాథ్ పై తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడీ బామ్మర్ది. చాడీలు చెబుతూ తనను కుటుంబానికి దూరం చెయ్యాలని ప్రయత్నించాడని ఆవేదన వ్యక్తం చేశాడు యోగేశ్.

  • Loading...

More Telugu News