Raghu Rama Krishna Raju: జగన్ సీబీఐ కోర్టులో వేసిన కౌంటర్ పై స్పందించిన రఘురామకృష్ణరాజు

There is no valuable matter in Jagans counter says Raghu Rama Krishna Raju

  • జగన్ పై వేసిన పిటిషన్ లో నా స్వార్థం లేదు
  • జగన్ తరపు న్యాయవాది చేసిన ఆరోపణల్లో నిజం లేదు
  • వేంకటేశ్వరస్వామి అన్నీ చూసుకుంటారు

అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సీబీఐ కేసులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో, సీఎం హోదాలో ఉన్న జగన్ బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని... వెంటనే ఆయన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కు సంబంధించిన విచారణ ప్రస్తుతం కోర్టులో కొనసాగుతోంది. ఈరోజే జగన్ తరపు న్యాయవాదులతో పాటు, సీబీఐ కూడా కోర్టులో కౌంటర్లు దాఖలు చేసింది.

ఈ సందర్భంగా రఘురాజు స్పందిస్తూ... జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ తాను వేసిన పిటిషన్ వెనుక ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేదని చెప్పారు. కోర్టులో జగన్ తరపు న్యాయవాది చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవాలు లేవని అన్నారు. పైనున్న వేంకటేశ్వరస్వామి అన్నీ చూసుకుంటారని వ్యాఖ్యానించారు. ఈ కేసులో కచ్చితంగా న్యాయం జరుగుతుందనే ఆశాభావం తనకు ఉందని చెప్పారు. జగన్ వేసిన కౌంటర్ లో ఎలాంటి విషయం లేదని తెలిపారు. తన ఆరోగ్యం కోసం, తన బెయిల్ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ పాదాభివందనాలు చేస్తున్నానని అన్నారు.

  • Loading...

More Telugu News