Dasoju Sravan: అందుకే ఈట‌ల రాజేంద‌ర్ ఢిల్లీకి వెళ్లారు: ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్

dasoju sravan slams kcr

  • తోడేళ్ల దాడి నుంచి తప్పించుకోవడానికే ఈట‌ల య‌త్నం
  • కేసీఆర్‌ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలనుకుంటున్నారు
  • ఈటల రాజేంద‌ర్‌తో పాటు ఆయన కుటుంబ స‌భ్యుల‌పై కేసులు

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఢిల్లీ వెళ్లి బీజేపీ నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌పై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ స్పందిస్తూ.. తోడేళ్ల దాడి నుంచి తప్పించుకోవడానికే ఈట‌ల అక్క‌డ‌కు వెళ్లారని అన్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికే ఈటల రాజేంద‌ర్‌తో పాటు ఆయన కుటుంబ స‌భ్యుల‌పై కేసులు పెడుతున్నారని శ్రవ‌ణ్‌ ఆరోపించారు.

తెలంగాణ‌లోని స‌మ‌స్య‌ల గురించి ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. వైద్యశాఖలో ఖాళీగా ఉన్న 50 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, 3,311 మంది స్టాఫ్‌ నర్సు ఉద్యోగాల్లో 2,418 ఉద్యోగాల‌ను మాత్ర‌మే ఇంతవరకు భర్తీచేశార‌ని ఆయ‌న అన్నారు. మిగతా 893 మందికి ఉద్యోగాలు ఇవ్వ‌కుండా అభ్యర్థులతో టీఎస్‌పీఎస్సీ చెలగాటం ఆడుతోందని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Dasoju Sravan
Congress
KCR
  • Loading...

More Telugu News