Myanmar: మయన్మార్‌లో ఆర్థిక సంక్షోభం.. డబ్బుల కోసం బ్యాంకుల ముందు జనం బారులు!
- ప్రజాప్రభుత్వాన్ని కూల్చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యం
- రాజకీయ అస్థిరతకు తోడు వేధిస్తున్న ఆర్థిక సంక్షోభం
- ఉదయం నుంచే బ్యాంకుల ముందు క్యూ కడుతున్న ప్రజలు
మయన్మార్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రజాప్రభుత్వాన్ని కూల్చేసి సైన్యం అధికారం చేపట్టిన తర్వాత దేశంలో రాజకీయ అస్థిరత చోటుచేసుకుంది. సైన్యానికి వ్యతిరేకంగా ప్రతి రోజూ నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు, దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత ఆర్థిక సంక్షోభానికి కారణమైంది.
ప్రజలు ముందుజాగ్రత్త చర్యగా డబ్బుల కోసం బ్యాంకుల ముందు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. అందినంత డ్రా చేసుకుంటుండడంతో బ్యాంకులు నగదు కొరతతో అల్లాడిపోతున్నాయి. దేశంలో అతిపెద్ద నగరమైన యాంగూన్‌లో ప్రజలు ఉదయం నుంచే బ్యాంకుల ముందు క్యూకడుతున్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం సందర్భంగా మూతపడిన బ్యాంకులు ఇప్పుడిప్పుడే తెరుచుకున్నాయి. అంతలోనే నగదు సమస్య వేధిస్తోంది.