Eatala Rajender: ఈటల ఢిల్లీ పయనం... రేపు కాషాయ తీర్థం పుచ్చుకునే అవకాశం!

Eatala fly off to Delhi to meet BJP top brass
  • ఇటీవల ఈటలపై భూకబ్జా ఆరోపణలు
  • మంత్రివర్గం నుంచి ఉద్వాసన
  • కొత్త పార్టీ పెడతారంటూ ప్రచారం
  • తెలంగాణ బీజేపీ నేతలతో సంప్రదింపులు
  • కాషాయ కండువా కప్పుకునేందుకు మార్గం సుగమం!
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు. రేపు ఈటల బీజేపీ అగ్రనేతలను కలవనున్నారు. ఈ క్రమంలోనే కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. బండి సంజయ్... ఈటలను పార్టీ అగ్రనేతల వద్దకు స్వయంగా తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది.

తాజా పరిణామాల నేపథ్యంలో ఈటల బీజేపీలో చేరడం దాదాపు ఖరారైనట్టేనని రాజకీయ వర్గాలంటున్నాయి. ఇటీవల భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్ సొంతపార్టీ పెడతారా? లేక ఇతర పార్టీల్లో చేరతారా? అని ఇటీవలి వరకు ప్రచారం జరిగింది. అయితే తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో ఈటల సంప్రదింపులు జరిపిన నేపథ్యంలో కొద్దిమేర స్పష్టత వచ్చింది.
Eatala Rajender
Delhi
BJP
Bandi Sanjay
Telangana

More Telugu News