NTR Trust: మరో కీలక నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్ ట్రస్ట్

NTR Trust decides to do funerals for orphans
  • అనాథ శవాలకు అంతిమ సంస్కారాలను నిర్వహించాలని నిర్ణయం
  • ఇప్పటికే ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లకు చురుగ్గా ఏర్పాట్లు
  • కరోనా బాధితులకు టెలీమెడిసిన్, మందులు, అన్నదానం
టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. అనాథ శవాలకు అంతిమ సంస్కారాలను నిర్వహించే బాధ్యతను చేపట్టింది. దిక్కూమొక్కు లేని వారికి ట్రస్ట్ తరపున అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. మరోవైపు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల నిర్మాణాలకు కూడా చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.

కరోనా బాధితుల కోసం ఇప్పటికే టెలీమెడిసిన్, మందుల పంపిణీతో పాటు అన్నదానం కూడా చేయాలని నిర్ణయించారు. ఏపీలోని టెక్కలి, కుప్పం, పాలకొల్లు, రేపల్లె పట్టణాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్టు ట్రస్ట్ తెలిపింది. ట్రస్ట్ తరపున ఇప్పటికే కొన్ని ఆక్సిజన్ కాన్‌సెన్‌ట్రేట‌ర్లను ఎన్టీఆర్ ట్రస్టు అందుబాటులోకి తీసుకొచ్చింది.
NTR Trust
Telugudesam

More Telugu News