Anandaiah: వారం రోజుల తర్వాత ఇంటికి చేరుకున్న ఆనందయ్య

Anandaiah arrives home after week long gap

  • ఈ నెల 21 నుంచి ఆనందయ్య మందు పంపిణీ నిలిపివేత
  • నెల్లూరు వెళ్లిన ఆనందయ్య
  • వారం తర్వాత కృష్ణపట్నం రాక
  • ఆనందయ్య నివాసం వద్ద పోలీసు భద్రత

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య వారం రోజుల తర్వాత తన ఇంటికి చేరుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 21 నుంచి కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయింది. మందు పంపిణీ నిలిచిపోవడంతో ఆనందయ్య నెల్లూరు వెళ్లారు. అప్పటినుంచి నెల్లూరులోనే ఉన్న ఆయన ఇవాళ కృష్ణపట్నం రావడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. వారం తర్వాత వచ్చిన ఆనందయ్యను కలిసేందుకు గ్రామస్థులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో, డీఎస్పీ ఆధ్వర్యంలో ఆనందయ్య నివాసం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ముత్తుకూరు నుంచి కృష్ణపట్నానికి రాకపోకలు నిషేధించారు.

Anandaiah
Home
Krishnapatnam
Nellore District
Corona Medicine
Andhra Pradesh
  • Loading...

More Telugu News