Gaurav Sharma: కుక్కను బెలూన్లకు కట్టి ఎగరేసిన యూట్యూబర్ అరెస్ట్

Delhi police arrests youtuber after he tied balloons to his dog

  • వ్యూస్ కోసం ప్రయత్నం!
  • కుక్కకు హైడ్రోజన్ బెలూన్లు కట్టిన గౌరవ్ శర్మ
  • వీడియోపై జంతుప్రేమికుల ఆగ్రహం
  • కేసు నమోదు చేసిన పోలీసులు
  • క్షమాపణలు చెప్పిన యూట్యూబర్

ఆన్ లైన్ వ్యూస్ కోసం కొన్నిసార్లు యూట్యూబర్లు చేసే ప్రయత్నాలు బెడిసికొడుతుంటాయి. ఢిల్లీకి చెందిన గౌరవ్ శర్మ (27) అనే యూట్యూబర్ కూడా అలాంటి ప్రయత్నమే చేసి చిక్కుల్లో పడ్డాడు. తన పెంపుడు కుక్కకు హైడ్రోజన్ బెలూన్లు కట్టి గాల్లో ఎగరేశాడు. జంతుప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయగా, ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది.

గౌరవ్ తన పేరుతోనే గౌరవ్ జోన్ అనే యూట్యూబ్ చానల్ నడుపుతున్నాడు. ఇటీవల అప్ లోడ్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహావేశాలు కలిగించింది. ఓ పార్కులో తన పెంపుడు కుక్క డాలర్ కు రంగురంగుల బెలూన్లు కట్టి గాల్లోకి ఎగరేశాడు. ఆపై తన ఘనకార్యాన్ని వీడియోలో వర్ణిస్తూ వ్యాఖ్యానం వినిపించాడు. వీడియోలో ఓ చోట కుక్క ఓ అపార్ట్ మెంట్ సెకండ్ ఫ్లోర్ వరకు ఎగరడం కనిపించింది.

అయితే ఓ కుక్కను అలా హింసించడం సరికాదని జంతుప్రేమికులు మండిపడ్డారు. దాంతో దిగొచ్చిన గౌరవ్ వీడియో తొలగించి, క్షమాపణలు చెప్పాడు. తాను అన్ని జాగ్రత్తలు తీసుకుని వీడియో రూపొందించానని తెలిపాడు. అయితే ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. గౌరవ్ పైనా, అతడి తల్లి పైనా కేసు నమోదు చేశారు. గౌరవ్ ను అరెస్ట్ చేయగా, బెయిల్ పై విడుదలయ్యాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News