: సౌదీ నుంచి స్వదేశానికి వెనుదిరగనున్న భారతీయులు
సౌదీలో కొత్తచట్టం పుణ్యమా అని సుమారు లక్షమంది భారతీయులు స్వదేశం బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. స్థానిక కంపెనీలలో ప్రతీ పది మంది ఉద్యోగులకు గాను ఒక ఉద్యోగం స్థానికులకే ఇవ్వాలంటూ నిటాకత్ చట్టాన్ని అక్కడి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఉద్యోగాలు కోల్పోయే వారు జూలై 3లోగా సౌదీని విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. దీంతో ఇప్పటికే వేలాది మంది ఎమర్జెన్సీ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇవి జారీ అయితేనే స్వదేశానికి వెళ్లడానికి వీలు ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత కార్మికుల అంశంపై చర్చించడానికి విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ సౌదీ వెళ్లారు. ఈ రోజు సాయంత్రం సౌదీ విదేశాంగ మంత్రితో సమావేశం అవుతారు. అయినా, ఫలితం ఉండకపోవచ్చని తెలుస్తోంది.