Meharin: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Meharin postponed her marriage to next year

  • పెళ్లి వాయిదా వేసుకున్న కథానాయిక 
  • మహేశ్ ఫస్ట్ లుక్ పై తేల్చేసిన నిర్మాతలు 
  • 'వకీల్ సాబ్' దర్శకుడితో నాని సినిమా 

*  తన పెళ్లిని వాయిదా వేసుకున్నానని చెబుతోంది కథానాయిక మెహరీన్. కాంగ్రెస్ నేత  భవ్య బిష్ణోయ్ తో మెహరీన్ కు మార్చి నెలలో నిశ్చితార్థం జరిగింది. అయితే, ఇటీవల ఆమెకు కరోనా సోకి కోలుకుంది. అయినా ఇంకా ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది. దానికి తోడు దేశంలో కూడా పరిస్థితులు ఇంకా చక్కబడనందున వచ్చే ఏడాదికి పెళ్లిని వాయిదా వేసుకున్నట్టు మెహరీన్ చెప్పింది.
*  మహేశ్ నటిస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రం ఫస్ట్ లుక్ ను సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ఈ నెల 31న విడుదల చేస్తారంటూ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. అయితే, అలాంటిదేమీ లేదని, ప్రస్తుతం కొవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం లేదని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీనిపై అనవసరమైన వదంతులను వ్యాపింపజేయవద్దని నిర్మాతలు కోరారు.
*  ఇటీవల 'వకీల్ సాబ్' వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని ఓ చిత్రాన్ని చేయనున్నాడు. ప్రస్తుతం ఈ విషయమై వీరిద్దరి మధ్య చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Meharin
Mahesh Babu
Nani
Venu Sriram
  • Loading...

More Telugu News