Moderna: బాలలపై 100 శాతం సమర్థతతో పనిచేస్తున్న మోడెర్నా వ్యాక్సిన్!

Moderna says their vaccine showed good results
  • 12 నుంచి 17 ఏళ్ల బాలలపై అధ్యయనం
  • సానుకూల ఫలితాలు వచ్చాయన్న మోడెర్నా
  • జూన్ లో ఎఫ్ డీఏకు దరఖాస్తు
  • అనుమతులు విస్తరించాలని కోరనున్న మోడెర్నా
కొవిడ్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన ఫార్మా కంపెనీల్లో మోడెర్నా కూడా ఒకటి. తాము రూపొందించిన వ్యాక్సిన్ బాలలపైనా సమర్థవంతంగా పనిచేస్తోందని మోడెర్నా చెబుతోంది. 12 నుంచి 17 ఏళ్ల బాలలపై తమ కొవిడ్ టీకాను ప్రయోగించి చూడగా, 100 శాతం సానుకూల ఫలితాలు వచ్చాయని మోడెర్నా వివరించింది. ఈ క్రమంలో జూన్ ఆరంభంలో ఎఫ్ డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) అనుమతులు కోరేందుకు సన్నద్ధమవుతోంది.

మోడెర్నా వ్యాక్సిన్ కు ఇప్పటికే అమెరికాలో ఎఫ్ డీఏ అనుమతులు ఉండగా, వ్యాక్సిన్ ను చిన్నారులకు కూడా ఉపయోగించేందుకు అనుమతిని విస్తరింపజేయాలని కోరనుంది. ఎఫ్ డీఏ అనుమతులు వస్తే, టీకా ఉత్పత్తిని మరింత పెంచనుంది. మోడెర్నా తన టీకాలను ఎం-ఆర్ఎన్ఏ 1273 సాంకేతిక విధానంతో అభివృద్ధి చేసింది. మోడెర్నా కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసుల వ్యాక్సిన్. దీన్ని ఇప్పటికే అమెరికాలో పెద్దవాళ్లకు ఇస్తున్నారు.
Moderna
Covid Vaccine
Children
FDA
USA

More Telugu News