Samantha: భయం వల్లనే బాలీవుడ్ లో చేయలేదంటున్న సమంత!

Samantha did not entered in to Bollywood yet

  • తెలుగు .. తమిళ భాషల్లో సమంతకు క్రేజ్
  • బాలీవుడ్ వైపు చూడని సమంత
  • మరింత ప్రతిభ అవసరమనే అభిప్రాయం    

తెలుగు .. తమిళ భాషల్లో సమంతకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ రెండు భాషల్లోని స్టార్ హీరోలతో ఆమె సినిమాలు చేసింది. అక్కడ ఇక్కడా కూడా తిరుగులేని విజయాలను అందుకుంది. వివాహమైన తరువాత సమంత గ్లామర్ ప్రధానమైన పాత్రలకు దూరంగా ఉంటోంది. నటన ప్రధానమైన పాత్రలకి మాత్రమే ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యంగా నాయిక ప్రధానమైన కథలకు ప్రాముఖ్యతను ఇస్తోంది. అలా త్వరలో ఆమె 'శాకుంతలం' చేయనుంది. గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ఇది రూపొందనుంది.

ఈ రెండు భాషల్లో ఎంత క్రేజ్ వచ్చినప్పటికీ సమంత బాలీవుడ్ వైపు వెళ్లలేదు. అసలు ఆ దిశగా ప్రయత్నాలే చేయలేదు. అలాంటిది ఇప్పుడు హిందీలో 'ఫ్యామిలీ మేన్' వెబ్ సిరీస్ చేస్తోంది. గతంలో హిందీ సినిమాలు ఎందుకు చేయలేదు? అనే ప్రశ్న రీసెంట్ గా ఆమెకి ఎదురైంది.

"భయం వల్లనే చేయలేదు .. అక్కడ నెగ్గుకు రావాలంటే మరింత ప్రతిభ అవసరం అనిపించింది" అని చెప్పుకొచ్చింది. అవకాశం వస్తే ఏ హీరో జోడీగా చేయాలనుంది? అనే ప్రశ్నకు సమాధానంగా ఆమె 'రణ్ బీర్ కపూర్' పేరు చెప్పింది. ఆ ముచ్చట తీరుతుందేమో చూడాలి మరి.

Samantha
Gunasekhar
Shakunthalam Movie
  • Loading...

More Telugu News