Buddist Monks: కరోనా బారిన పడిన 100 మంది బౌద్ధ సన్యాసులు

100 Buddist monks affected with Corona virus

  • ఆధ్యాత్మిక కేంద్రాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన సిక్కిం అధికారులు
  • కరోనా బారిన పడిన వారిని ఐసొలేషన్ కేంద్రాలకు తరలింపు
  • బయటి నుంచి వచ్చిన వారి ద్వారా వైరస్ సోకి ఉంటుందని అనుమానం

ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనతో ఉండే బౌద్ధ సన్యాసులను కూడా కరోనా మహమ్మారి వదలడం లేదు. సిక్కింలోని ఆధ్యాత్మిక కేంద్రాల్లో దాదాపు వంద మంది బౌద్ధ సన్యాసులకు కరోనా పాటిజివ్ నిర్ధారణ అయింది. గ్యాంగ్ టక్ కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రూమ్ టెక్ కేంద్రంలో తొలుత 37 మంది సన్యాసులు కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత గుంజాంగ్ మోనాస్టరీలో 61 మంది సన్యాసులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో, ఈ కేంద్రాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. కరోనా బారిన పడినవారిని వివిధ ఐసొలేషన్ కేంద్రాలకు తరలించారు.

మరోవైపు ఆధ్యాత్మిక కేంద్రాల్లోకి ఎవరినీ అనుమతించబోమని గ్యాంగ్ టక్ డివిజినల్ మేజిస్ట్రేట్ తెలిపారు. ఇంకోవైపు సిక్కింలో లాక్ డౌన్ ను మరోవారం పాటు పొడిగించారు. రూమ్ టెక్ కేంద్రానికి ప్రపంచ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు ఉంది. దేశ, విదేశాల నుంచి వేలాది మంది బౌద్ధ సన్యాసులు ఈ కేంద్రానికి వస్తుంటారు. వీరి ద్వారానే ఇక్కడి సన్యాసులకు కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు.

Buddist Monks
Sikkim
Corona Virus
  • Loading...

More Telugu News