horse: క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తూ గుర్రం అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్న వంద‌లాది మంది.. వీడియో ఇదిగో

Hundreds of people were seen at the funeral of a horse in the Maradimath area of Belagavi

  • క‌ర్ణాట‌క‌లో ఘ‌ట‌న‌
  • చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్న హోంమంత్రి
  • దేవ‌తా గుర్రంగా స్థానికుల న‌మ్మకం

క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో సొంత కుటుంబ స‌భ్యుల‌ అంత్యక్రియ‌ల‌కు కూడా రాలేక‌పోతోన్న రోజులివి. మ‌నుషులు చ‌నిపోతే అతి త‌క్కువ మందితోనే అంత్య‌క్రియ‌లు పూర్తి చేసేందుకు అనుమ‌తి ఉంది. అటువంటిది ఓ గుర్రం చ‌నిపోతే వంద‌లాది మంది క‌లిసి క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌కుండా అంత్య‌క్రియ‌లు చేశారు. క‌ర్ణాట‌క‌లోని బెళ‌గావిలోని మ‌రాడిమ‌ట్ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఈ ఘ‌ట‌న‌పై క‌ర్ణాట‌క హోం శాఖ మంత్రి బ‌స‌వ‌రాజ్ స్పందిస్తూ... జిల్లా అధికారులు ఈ విష‌యంపై ద‌ర్యాప్తు జ‌రుపుతున్నార‌ని, నిర్వాహ‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. కాగా, బెళ‌గావిలోని మ‌రాడిమ‌ట్ ప్రాంతంలోని ఓ ఆశ్ర‌మంలో సిద్ధేశ్వ‌ర మ‌ఠానికి చెందిన ఆ గుర్రాన్ని దేవ‌తా అశ్వంగా గ్రామ‌స్థులు భావిస్తారు. ఈ నేప‌థ్యంలోనే దాని అంత్య‌క్రియ‌ల‌కు పెద్ద ఎత్తున స్థానికులు త‌ర‌లివ‌చ్చారు.

  • Loading...

More Telugu News