West Bengal: సువేందు అధికారి తండ్రి శిశిర్​ అధికారికి వై ప్లస్ భద్రత

Suvendu Father Sisir To Get Y plus Security

  • దివ్యేందు అధికారికీ అదే భద్రత
  • అంగరక్షకులుగా సీఆర్పీఎఫ్ బలగాలు
  • మమతను ఢీకొట్టి గెలిచిన సువేందు

సువేందు అధికారి తండ్రి, బెంగాల్ ఎంపీ శిశిర్ అధికారికి కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ భద్రతను కల్పించింది. శిశిర్ అధికారితో పాటు ఆయన మరో తనయుడు దివ్యేందు అధికారికీ వై ప్లస్ భద్రతను ఇవ్వనుంది. అందులో భాగంగా సీఆర్పీఎఫ్ బలగాలు వారికి అంగరక్షకులుగా ఉంటారు.

తృణమూల్ కాంగ్రెస్ నుంచి సువేందు అధికారి బయటకు వచ్చేసిన తర్వాత.. శిశిర్ అధికారి కూడా బీజేపీలో చేరారు. తృణమూల్ లో తనకు మమత గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు. ఇక, నందిగ్రామ్ నుంచి తనపై పోటీ చేసి గెలవాలని మమతకు సవాల్ చేసి మరీ సువేందు విజయం సాధించారు. దీంతో ఆయన్ను బీజేపీ శాసనసభా నేతగా ప్రకటించారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ 77 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

West Bengal
Suvendu Adhikari
Sisir Adhikari
BJP
  • Loading...

More Telugu News