Nayanthara: ప్రియుడితో కలిసి వ్యాక్సిన్ వేయించుకున్న హీరోయిన్ న‌య‌న‌తార‌.. ఫొటోలు వైర‌ల్

nayan pics go viral

  • ఇప్ప‌టికే వారిద్ద‌రికీ నిశ్చితార్థం
  • ఒకే రంగు టీష‌ర్టులే ధ‌రించి క‌న‌ప‌డుతోన్న సెల‌బ్రిటీలు  
  • ప్ర‌స్తుతం ఇద్దరూ సినిమాల్లో బిజీ

హీరోయిన్ నయనతార, ద‌ర్శ‌కుడు విఘ్నేశ్‌ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వారిద్ద‌రికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో త‌రుచూ వైర‌ల్ అవుతుంటాయి. ఈ ఏడాది మార్చిలో వారి నిశ్చితార్థం కూడా జ‌రిగింద‌ని ప్ర‌చారం జ‌రిగింది.  

త్వ‌ర‌లోనే వారి పెళ్లి జ‌ర‌గ‌నుంద‌న్న వార్త‌లు మ‌రోసారి వ‌చ్చాయి. అయితే, క‌రోనా రెండో ద‌శ విజృంభ‌ణ‌ కార‌ణంగానే పెళ్లి వాయిదా ప‌డింద‌ని ప్రచారం జ‌రిగింది. ప్ర‌స్తుతం వారిద్ద‌రు సినిమాల్లో బిజీగా ఉన్నారు. వీరిద్ద‌రికి సంబంధించి తాజాగా మ‌రిన్ని ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.
              
ఈ ప్రేమ జంట వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లి టీకాలు వేయించుకున్నారు. నోటికి మాస్కులు పెట్టుకుని, ఒకే రంగు టీష‌ర్టులు ధ‌రించి ఈ ఫొటోల్లో వారు క‌న‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం  విఘ్నేశ్..  విజయ్‌ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

Nayanthara
Kollywood
Tamilnadu
vaccine
  • Error fetching data: Network response was not ok

More Telugu News