Srinivasa Reddy: ఆసక్తిని రేపుతున్న 'ముగ్గురు మొనగాళ్లు' ఫస్టులుక్

Mugguru Monagallu first look poster released
  • డిఫరెంట్ కాన్సెప్ట్ తో 'ముగ్గురు మొనగాళ్లు'
  • దర్శకుడిగా అభిలాష్ పరిచయం
  • ముగింపు దశలో పోస్ట్ ప్రోడక్షన్ పనులు  
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా పలకరిస్తున్నాయి .. అనూహ్యమైన విజయాలను అందిస్తున్నాయి. 'జాతిరత్నాలు' సినిమా పెట్టుబడికి మించి ఎన్నోరెట్లు ఎక్కువగా వసూలు చేసింది. అదే తరహాలో రూపొందిన మరో సినిమా థియేటర్లు తెరవడమే ఆలస్యం రంగంలోకి దిగడానికి సిద్ధమవుతోంది .. ఆ సినిమానే 'ముగ్గురు మొనగాళ్లు'. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నుంచి తాజాగా ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

అచ్యుత రామారావు నిర్మించిన ఈ సినిమాలో శ్రీనివాస రెడ్డి .. దీక్షిత్ శెట్టి .. వెన్నెల రామారావు ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ ముగ్గురు కథానాయకులలో ఒకరికి కనిపించదు .. ఒకరికి వినిపించదు ... మరొకరు మాట్లాడలేరు. ఆ విషయాన్ని స్పష్టం చేస్తూనే ఈ సినిమా పోస్టర్ ను ఇలా డిజైన్ చేసి వదిలారు .. పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. విభిన్నమైన ... విలక్షణమైన కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటోంది. ఈ 'ముగ్గురు మొనగాళ్లు' ఏ రేంజ్ లో మెప్పిస్తారో చూడాలి మరి.

Srinivasa Reddy
Deekshith Shetty
Vennela Ramarao

More Telugu News