: హెచ్ఆర్సీకి ఎమ్మెల్యే శంకరరావు కుమార్తె ఫిర్యాదు
గ్రీన్ ఫీల్డ్స్ భూముల వ్యహరంలో పోలీసులు తన తండ్రిని కక్ష సాధింపు చర్యలకు గురిచేస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకరరావు కుమార్తె సుస్మిత మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. తన తండ్రికి ఏమైనా జరిగితే అందుకు ముఖ్యమంత్రి, డీజీపీలదే బాధ్యత అని ఆమె హెచ్చరించారు. ఎమ్మెల్యే తనయ ఫిర్యాదు స్వీకరించిన హెచ్ఆర్సీ.. ఏప్రిల్ 2 లోగా పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది.