Priyanka Chopra: అవును... నా శరీర ఆకృతి మారిపోయింది: ప్రియాంక చోప్రా

Yes my body shape changed says Priyanka Chopra
  • ప్రియాంక ప్రస్తుత వయసు 38 సంవత్సరాలు
  • వయసుతో పాటు శరీరాకృతి మారుతుందన్న ప్రియాంక
  • శరీర మార్పులను అందరూ స్వీకరించాలని సూచన
బాలీవుడ్ లో అగ్రనటిగా కొనసాగిన ప్రియాంక చోప్రా ఇప్పుడు ఎక్కువ సమయం బాలీవుడ్ కే కేటాయిస్తోంది. అమెరికన్ సింగర్ జొనాస్ ను పెళ్లాడిన తర్వాత ఆమె అక్కడే ఉంటోంది. ప్రస్తుతం ఆమె వయసు 38 సంవత్సరాలు, తన కంటే చిన్నవాడైన జొనాస్ ను ప్రేమించి పెళ్లాడింది. ఇటీవల యాహూ లైఫ్ కి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. అయితే ఆమె శరీరాకృతిపై నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ కామెంట్లపై ప్రియాంక చోప్రా చాలా మెచ్యూరిటీతో సమాధానం ఇచ్చింది. వయసుతో పాటు వచ్చే శారీరక మార్పులను మానసికంగా స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పింది. శారీరక మార్పులతో తాను ఇబ్బంది పడటం లేదనే అబద్ధాన్ని తాను చెప్పలేనని తెలిపింది. వయసు పెరుగుతున్నందున తన శరీరం చాలా మార్పులకు గురైందని తెలిపింది.

అందరి శరీరాల మాదిరే తన శరీరం కూడా మార్పు చెందుతోందని ఆమె వ్యాఖ్యానించింది. వయసుతో వచ్చే మార్పులను ప్రతి ఒక్కరూ స్వీకరించాల్సిందేనని... తాను కూడా తన శారీరక మార్పులను స్వీకరిస్తున్నానని చెప్పింది. ఇప్పుడు తన శరీరం ఇలాగే ఉందని చెపుతూ ఒక ఫొటోను పోస్ట్ చేసింది. ఇప్పుడున్న తన శరీరానికి మాత్రమే తాను తగు జాగ్రత్తలు తీసుకోగలనని... 20 ఏళ్ల క్రితం లేదా 10 ఏళ్ల క్రితం శరీరానికి కాదని నెటిజెన్లకు చురకంటించింది.
Priyanka Chopra
Bollywood
Body Shape

More Telugu News