Lockdown: కరోనా ఎఫెక్ట్: ఇంట్లోనే రంజాన్ ప్రార్థనలు
- కరోనా వేళ భౌతిక దూరం పాటిస్తూ ప్రార్థనలు
- చాలా చోట్ల ఇంట్లోనే ప్రార్థనలు
- లాక్‌డౌన్ అమల్లో ఉన్న రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి
కరోనా మహమ్మారి కట్టడికి తెలంగాణలో అమలు చేస్తున్న లాక్‌డౌన్ కారణంగా రంజాన్ పండుగ బోసిపోయింది. రంజాన్ పర్వదినాన్ని ఎంతో గొప్పగా చేసుకునే ముస్లింలు ఈసారి నిరాడంబరంగా జరుపుకుంటున్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉండడంతో ఇదే పరిస్థితి నెలకొంది.
సాధారణంగా రంజాన్ వేళ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ముస్లింలందరూ ఒకే చోటకు చేరి సామూహికంగా ప్రార్థనలు నిర్వహిస్తారు. అయితే, కరోనా భయం ఈసారి అందరినీ ఒక చోటుకు చేర్చలేకపోయింది. దీనికి తోడు ఆంక్షలు ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు చోట్ల కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రార్థనలు చేస్తుండగా, చాలామంది ఇళ్లలోనే ప్రార్థనలు చేస్తున్నారు.