Corona Virus: తెలంగాణ ఆసుపత్రులలో బెడ్ రిజర్వేషన్ వుంటేనే రావాలి.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే రోగుల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు!

Special guidelines for patients coming from neighboring states

  • కంట్రోలు రూము ఏర్పాటు 
  • సరిహద్దుల వద్ద ప్రత్యేక బృందాలు
  • రోగి వివరాల నమోదు కోసం ప్రత్యేక వెబ్‌సైట్

పక్క రాష్ట్రాల నుంచి కొవిడ్ చికిత్స కోసం తెలంగాణ ఆసుపత్రులకు వచ్చే వారికి ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది. పొరుగు రాష్ట్రాల నుంచి అంబులెన్సులు, వాహనాల్లో చికిత్స కోసం పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వారి వల్ల వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉండడంతో సీఎస్ సోమేశ్ కుమార్ నిన్న ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేశారు.

ఇక నుంచి హైదరాబాద్‌లో చికిత్స కోసం వచ్చే రోగులు ఇక్కడి ఆసుపత్రులలో ముందుగా బెడ్ ను రిజర్వ్ చేసుకుని వుంటేనే రాష్ట్రంలోకి అనుమతిస్తారు. ఈ వివరాలను కంట్రోల్ రూము (040 2465119, 9494438251)కు కానీ, లేదంటే idsp@telangana.gov.in వెబ్‌సైట్‌కు కానీ ఆయా ఆసుపత్రులు తెలియజేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రోగి పేరు, వయసు, రాష్ట్రం, అటెండెంట్ పేరు, మొబైల్ నంబరు, టైఫ్ ఆఫ్ బెడ్ వంటి వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. రోగుల వాహనాలు రాష్ట్రంలోకి వచ్చేటప్పుడు ఈ వివరాలను చెబితే అనుమతిస్తారు. ఇందుకోసం సరిహద్దుల వద్ద ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News