TTD: కొవిడ్ బాధితుల చికిత్స కోసం జర్మన్ హ్యాంగర్లు: ముందుకొచ్చిన టీటీడీ

German hangers for the covid victims treatment
  • శ్రీ పద్మావతి కొవిడ్ ఆసుపత్రిలో జర్మన్ హ్యాంగర్ ఏర్పాటు
  • రాష్ట్రవ్యాప్తంగా మరో 22 చోట్ల ఏర్పాటుకు నిధులు మంజూరు
  • ఒక్కో దాంట్లో 30 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసే అవకాశం
కరోనా మహమ్మారిపై పోరుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముందుకొచ్చింది. కొవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు రాష్ట్రంలో 22 జర్మన్ హ్యాంగర్లు నిర్మించేందుకు రూ. 3.52 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి కొవిడ్ ఆసుపత్రి వద్ద ఇటీవల జర్మన్ హ్యాంగర్ నిర్మించి కొవిడ్ బాధితుల కోసం ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ నేపథ్యంలో ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలంటూ టీటీడీకి వినతులు వెల్లువెత్తాయి. స్పందించిన టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీ వేంకటేశ్వర సర్వశ్రేయనిధి నుంచి నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో విశాఖ జిల్లాలో 4, అనంతపురం, కృష్ణా, గుంటూరుతోపాటు మరో జిల్లాలో మూడు చొప్పున, ప్రకాశం, కర్నూలు, మరో జిల్లాలో రెండు చొప్పున జర్మన్ హ్యాంగర్లు నిర్మిస్తారు.  ఒక్కో దాంట్లో గరిష్ఠంగా 30 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
TTD
Oxgen Beds
Corona Virus
German Hanger

More Telugu News