KPHB Colony: కేపీహెచ్బీ కాలనీలోని దేవాలయంలో దొంగతనం.. ఆభరణాలు, కిరీటం చోరీ!
- 7వ ఫేజ్ లోని కాశీ విశ్వనాథస్వామి ఆలయంలో చోరీ
- సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి దొంగతనానికి పాల్పడ్డ వైనం
- 11 కిలోల వెండి ఆభరణాలు, స్వామివారి కిరీటం చోరీ
హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలోని 7వ ఫేజ్ లో ఉన్న శ్రీ కాశీ విశ్వనాథస్వామి ఆలయ సముదాయంలో చోరీ జరిగింది. నిన్న రాత్రి ఆలయానికి తాళం వేసి పూజారి వెళ్లిపోయారు. ఉదయం ఆయన ఆలయాన్ని తెరిచేందుకు రాగా... గుడి తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. గుడిలోని సీసీ కెమెరాల వైర్లను కట్ చేసిన దొంగలు చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. ఆలయ సముదాయంలోని మూడు గుళ్లలో 11 కిలోల వెండి ఆభరణాలు, స్వామివారి కిరీటం, ఇతర వస్తువులను దొంగిలించారని పూజారి తెలిపారు. క్లూస్ టీమ్ ఆధారంగా ఆధారాలను సేకరించి దొంగలను అరెస్ట్ చేస్తామని డీఎస్పీ శ్యాంబాబు తెలిపారు.