Nellore District: నెల్లూరులో విషాదం.. పరిశ్రమలో గ్యాస్ లీక్‌.. ముగ్గురి మృతి

gas leak in nellore

  • మ‌రొక‌రి ప‌రిస్థితి విష‌మం
  • నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో ఘ‌ట‌న‌
  • చండ్రపడియాలో రసాయనిక పరిశ్రమలో ప్ర‌మాదం

నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని చండ్రపడియాలో ఈ రోజు ఉద‌యం రసాయనిక పరిశ్రమలో గ్యాస్‌ లీకైంది. దీంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘ‌ట‌న‌లో అస్వ‌స్థ‌త‌కు గురైన మరొకరిని ఆసుప‌త్రికి త‌ర‌లించిన స‌హాయ‌క బృందాలు చికిత్స అందేలా చేశాయి. అతని పరిస్థితి విషమంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. గ్యాస్ లీక్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌రిశ్ర‌మ‌ల్లో త‌రుచూ గ్యాస్ లీక్ ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటుండ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

Nellore District
Andhra Pradesh
gas leak
  • Loading...

More Telugu News