: కొత్త వ్యాక్సిన్‌తో అతిసారకు చెక్!
అతిసార వ్యాధి (డయేరియా) నిర్మూలనకు కొత్త రకం వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు మూడు లక్షల మందిదాకా చిన్నారులను బలి తీసుకుంటున్న అతిసారను దూరం చేయడానికి శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అతిసార వ్యాధి రాకుండా ఉండేందుకు ఒక కొత్త రకం వ్యాక్సిన్ కనుగొన్నారు. ఈ వ్యాక్సిన్‌ను నోటి ద్వారా అందిస్తారు. యూనివర్సిటీ ఆఫ్ గోతెన్ బర్గ్ వ్యాక్సిన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వారు ఈ వ్యాక్సిన్ విజయవంతంగా పనిచేసిందని తెలిపారు.
అతిసారకు ఇ-కొలి బ్యాక్టీరియా కారణం. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ కల దేశాల్లో అతిసార వ్యాధి బారిన పడి అనేకమంది పిల్లలు ఏటా మరణిస్తున్నారు. అతిసార వ్యాధి సోకే అనేక ప్రాంతాల్లో ఈ వ్యాధికి సంబంధించిన ఎలాంటి వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. స్వీడన్‌లో ప్రస్తుతం నోటి ద్వారా అందించే కొత్త రకం వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. తొలి దశ పరీక్షల్లో ఇది విజయవంతంగా పనిచేసిందని శాస్త్రవేత్తలు తెలిపారు.