Narendra Modi: కరోనా పరిస్థితులపై తెలుగు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన మోదీ!

modi spoke with cms of several states to discuss on corona situation

  • దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా విలయం
  • పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ సమీక్ష
  • కొవిడ్‌ పరిస్థితులు, నియంత్రణ చర్యలపై ఆరా
  • అంతకుముందు మంత్రులు, ఉన్నాధికారులతో సమావేశం

దేశవ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ నేడు సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్ సీఎంలతో మాట్లాడినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై మోదీ ఆరా తీశారు. అలాగే నియంత్రణ చర్యలు.. చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించారు. పుదుచ్చేరి, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లతో కూడా మోదీ మాట్లాడినట్లు సమాచారం.

అంతకుముందు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమం వేగం తగ్గకుండా చూడాలని ఆదేశించారు. ఇక దేశవ్యాప్తంగా 4 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 4,12,262 మందికి కొవిడ్ సోకింది. 24 గంటల్లో 3,980 మంది కరోనా చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు.

  • Loading...

More Telugu News