Kangana Ranaut: గోద్రా మారణకాండను కంగన పరోక్షంగా ప్రస్తావించిందా?

Is Kangana Remembered Godhra Riots

  • పశ్చిమ బెంగాల్ అల్లర్ల అనంతరం కంగన వివాదాస్పద వ్యాఖ్యలు 
  • మోదీ 2000 నాటి తన విశ్వరూపాన్ని మళ్లీ ప్రదర్శించాలి 
  • మమతను లొంగదీసుకోవాలంటూ ట్వీట్
  • తెరపైకి గోద్రా అల్లర్ల ప్రస్తావనను తెచ్చిన విశ్లేషకులు  

వివాదాస్పద బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇటీవల ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేసి శాశ్వత నిషేధానికి గురయ్యారు. గతంలోనూ ఆమె ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటికీ ఖాతా రద్దు కాలేదు కానీ, రద్దు చేయాలన్న డిమాండ్లు వచ్చాయి. అయితే, ఇప్పుడు మాత్రం ఆమె విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ ట్విట్టర్ ఆమె ఖాతాను శాశ్వతంగా మూసివేసింది.

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన అల్లర్లను ఉద్దేశిస్తూ మోదీ 2000వ సంవత్సరంలో ప్రదర్శించిన విశ్వరూపాన్ని మళ్లీ ప్రదర్శించి మమతను లొంగదీసుకోవాలని కంగన తన ట్వీట్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ సంవత్సరంలో గుజరాత్‌లో అల్లర్లు జరిగాయి. అనంతరం జరిగిన గోద్రా మారణకాండలో ఎంతోమంది ముస్లింలు మరణించారు. ఇప్పుడా విషయాన్ని కంగన పరోక్షంగా ప్రస్తావించడం ద్వారా ఆ పనిని మోదీనే చేయించారని ఆమె భావిస్తున్నట్టు ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆమె తెలిసి చేసినా, తెలియక చేసినా గుజరాత్ అల్లర్లు, ఆ సమయంలో మోదీపై వచ్చిన ఆరోపణలు మళ్లీ తెరపైకి వచ్చాయని చెబుతున్నారు. మరోవైపు, కంగన మాత్రం ట్విట్టర్ ఒక్కటే సర్వస్వం కాదని, తాను గొంతు విప్పేందుకు అనేక మార్గాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News