Kamal Haasan: ఒక్క రూపాయి కూడా పంచని కమల్... ఒక్క సీటూ ఇవ్వని తమిళులు!

No Note for Vote is the Main Reason for Kamal Defete in TN

  • 142 స్థానాల్లో పోటీ పడిన కమల్ పార్టీ
  • అధినేత సహా అందరూ ఓటమి
  • విలువలకు కట్టుబడిన వ్యక్తని ప్రశంసలు

కమల్ హాసన్... విలక్షణ నటుడిగా, దక్షిణాదిన కోట్లాది మంది సినీ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న వ్యక్తిగా, పరిచయం అక్కర్లేని పేరు. తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 142 స్థానాల్లో పోటీ చేసిన కమల్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యమ్, ఒక్కటంటే ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. తాను ఓట్ల కోసం డబ్బులు పంచబోనని, సరికొత్త రాజకీయ వాతావరణాన్ని సృష్టించడమే తన లక్ష్యమని ముందే ప్రకటించిన కమల్, అన్న మాటను చేసి చూపారు. ఫలితంగా విలువలకు కట్టుబడిన వ్యక్తిగా గెలిచిన ఆయన, ఓట్లను పొందడంలో మాత్రం ఓడిపోయారు.

ఈ ఎన్నికల్లో కమల్ సహా ఎంఎన్ఎం పార్టీ అభ్యర్థులంతా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఎంఎన్ఎం తరఫున బరిలోకి దిగిన వారంతా ఎక్కడా డబ్బులు పంచలేదు. దీంతో వారెవరికీ ఓట్లు పడలేదని ఇప్పుడు కామెంట్లు వస్తున్నాయి. కోయంబత్తూరు దక్షిణం నుంచి బరిలోకి దిగిన కమల్, బీజేపీ అభ్యర్థి వాసతి చేతిలో దాదాపు 1,500 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

  • Loading...

More Telugu News