Nepal: దేశీయ, అంతర్జాతీయ విమానాలను నిషేధించిన నేపాల్

Nepal bans all domestic and international flights

  • నేటి అర్ధ రాత్రి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు అమలు
  • కరోనా కేసులకు అడ్డుకట్ట వేసేందుకే
  • గత నెల 29నే బస్సు సర్వీసుల నిలిపివేత

దేశంలో పెరిగిపోతున్న కరోనా కేసులకు అడ్డుకట్ట వేసేందుకు పొరుగు దేశం నేపాల్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. నేటి అర్ధరాత్రి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు నిషేధం అమల్లో ఉంటుందని ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి హృదయేష్ త్రిపాఠి తెలిపారు. అయితే, చార్టెర్డ్ విమానాలను మాత్రం అనుమతిస్తామన్నారు.

దేశంలో అడుగుపెట్టే యాత్రికులు సహా ప్రతి ఒక్కరికి హోటళ్లలో పది రోజుల క్వారంటైన్ తప్పనిసరని, 72 గంటల్లోపు చేయించుకున్న కరోనా నెగటివ్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతిస్తామని స్పష్టం చేశారు. కాగా, నేపాల్ గత నెల 29నే బస్సు సర్వీసులను నిలిపివేసింది. నేపాల్‌లో ఇప్పటి వరకు 3.36 లక్షల కేసులు నమోదు కాగా, 48,711 కేసులు క్రియాశీలంగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News