: 'తానా' మహాసభలకు ముఖ్య అతిథిగా చిరంజీవి


కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అమెరికాలో ప్రముఖ తెలుగు సంఘం తానా నిర్వహించే మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. ఈ మహాసభలు ఈ నెల 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు డల్లాస్ నగరంలో జరగనున్నాయి. ఇక్కడి కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగే ఈ సభలకు చిరంజీవితో పాటు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, రాష్ట్ర మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, గంటా శ్రీనివాసరావు, టాలీవుడ్ సినీ ప్రముఖులు మురళీ మోహన్, జయప్రద, జయసుధ, ఎస్సీ బాలసుబ్రమణ్యం, పరుచూరి గోపాలకృష్ణ, శ్రీను వైట్ల, చార్మి, ప్రఖ్యాత గాయకుడు కేజే యేసుదాసు తదితరులు హాజరవనున్నారు. భారత కాలమానం ప్రకారం ఈ సభలు శనివారం ఉదయం ఐదింటికి ప్రారంభం అవుతాయి.

  • Loading...

More Telugu News