KKR: పంజాబ్ కింగ్స్ ను సమష్టిగా కట్టడి చేసిన కోల్ కతా బౌలర్లు

KKR bowlers controls Punjab Kings for a low score

  • అహ్మదాబాద్ లో పంజాబ్ వర్సెస్ కోల్ కతా
  • మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్
  • కోల్ కతా బౌలర్ల దాటికి పంజాబ్ కింగ్స్ విలవిల
  • 31 పరుగులు చేసిన మయాంక్
  • ఆఖర్లో బ్యాట్ ఝుళిపించిన జోర్డాన్
  • 20 ఓవర్లలో 9 వికెట్లకు 123 పరుగులు చేసిన పంజాబ్

ఐపీఎల్ లో నేడు పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 123 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులోని బ్యాట్స్ మెన్ ఏ దశలోనూ ఉత్సాహంగా బ్యాటింగ్ చేయలేకపోయారు. మయాంక్ అగర్వాల్ 31 పరుగులు చేయగా, చివర్లో క్రిస్ జోర్డాన్ 18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులతో 30 పరుగులు చేయడంతో పంజాబ్ కు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది.

కోల్ కతా బౌలర్లు ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించారు. భారీ హిట్టర్లున్న పంజాబ్ కు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. ప్రసిద్ధ్ కృష్ణ 3, ప్యాట్ కమిన్స్ 2, సునీల్ నరైన్ 2, వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News