Corona Virus: కరోనా ఎఫెక్ట్.. బెజవాడ దుర్గమ్మ దర్శన వేళల్లో మార్పు
- ఏపీలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ
- ఉదయం 6.30 నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతి
- ఆలయ ఉద్యోగులు, అర్చకులు మాస్క్ ధరించకుంటే రూ. 200 ఫైన్
ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉండడంతో బెజవాడ దుర్గమ్మ దర్శన వేళల్లో మార్పులు చేసినట్టు ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. నగరంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండడంతో ఉదయం ఆరున్నర గంటల నుంచి సాయంత్రం ఏడున్నర గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతించనున్నట్టు పేర్కొన్నారు.
ఆలయ ఉద్యోగులు, అర్చకులు మాస్కు ధరించకుంటే రూ. 200 జరిమానా విధించాలని నిర్ణయించినట్టు చెప్పారు. దుర్గగుడి పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, దేవస్థానం వైదిక కమిటీ సభ్యులతో నిన్న నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు భ్రమరాంబ వెల్లడించారు.