Prabhas: ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా అప్ డేట్స్!

Prabhas Adipurush updates

  • ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్'
  • ప్రభాస్ సరసన నాయికగా కృతిసనన్
  • 30 రోజుల్లో 30 శాతం షూటింగ్ పూర్తి
  • ప్రభాస్, సైఫ్ మధ్య ఫైట్స్ హైలైట్    

 ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు వేటికవే ప్రత్యేకతలు కలిగినవి.. వేటికవే భారీ బడ్జెట్ సినిమాలు. ఇప్పటికే 'రాధేశ్యామ్' చిత్రాన్ని దాదాపు పూర్తి చేసిన ప్రభాస్.. మరో రెండు సినిమాల షూటింగ్స్ చేస్తున్నారు. వీటిలో ఒకటి కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న 'సలార్'. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న దీనికి సంబంధించిన ఓ షెడ్యూలు ఆమధ్య జరిగింది.

ఇక మరో భారీ భారీ బడ్జెట్ సినిమా 'ఆదిపురుష్'. ఒక విధంగా ప్రభాస్ నటిస్తున్న తొలి డైరెక్ట్ హిందీ సినిమా అవుతుందిది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరకెక్కుతోంది. గత నెలలోనే ఈ చిత్రం షూటింగ్ ముంబైలో మొదలైంది. ఈ సినిమా కోసం భారీ సెట్స్ కూడా వేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రోగ్రెస్ గురించి దర్శకుడు ఓం రౌత్ మీడియాకు చెప్పారు.

"ఇప్పటివరకు 30 రోజుల పాటు షూటింగ్ జరిగిందనీ, ఇందులో 30 శాతం వరకు చిత్రీకరణ పూర్తయిందని ఆయన చెప్పారు. ఈ సినిమాలో హీరో ప్రభాస్, విలన్ సైఫ్ అలీఖాన్ మధ్య జరిగే యాక్షన్ సీన్స్ చాలా గ్రాండియర్ గా వుంటాయని, ఇవి సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని ఆయన తెలిపారు. ఇక స్క్రిప్టును చాలా రీసెర్చ్ చేసి, తయారుచేశాననీ, అందువల్ల కాంట్రవర్శీకి ఆస్కారం ఉండదని అన్నారు. ఇందులో బాలీవుడ్ భామ కృతిసనన్ ప్రభాస్ సరసన కథానాయికగా నటిస్తోంది. వచ్చే ఏడాది ఆగస్టు 11న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారు.

Prabhas
om Rawath
Adipurush
Kriti Sanan
  • Loading...

More Telugu News