Vijayawada: విజయవాడలో రేపు వ్యాపార సంస్థల మూసివేత

shops in vijayawada will be closed tomorrow

  • కరోనా కట్టడిలో భాగంగా నిర్ణయం
  • 19వ తేదీ నుంచి 30 వరకు సాయంత్రం ఆరు గంటల వరకే  దుకాణాలు 
  • వ్యాపారులు, వినియోగదారులు సహకరించాలన్న వాణిజ్య మండలి

విజయవాడలో రేపు వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా ఆదివారం నగరంలోని వ్యాపార సంస్థలను పూర్తిగా మూసివేస్తున్నట్టు విజయవాడ వాణిజ్య మండలి పేర్కొంది. వ్యాపారులు, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వాణిజ్య మండలి అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు తెలిపారు.

 వ్యాపారులు, వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 19 నుంచి 30వ తేదీ వరకు ప్రతి రోజూ సాయంత్రం ఆరు గంటలకే దుకాణాలను మూసివేయాలని కూడా నిర్ణయించినట్టు చెప్పారు. కరోనా కట్టడికి అందరూ సహకరించాలని, వ్యాపారులు, సిబ్బంది సహా ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరించాలని కోరారు.

Vijayawada
Business
Shops
Corona Virus
  • Loading...

More Telugu News