YS Sharmila: కాకతీయ గడ్డ మీద రుద్రమదేవి తర్వాత మళ్లీ షర్మిలను చూస్తున్నా: కంచె ఐలయ్య ప్రశంసలు
- షర్మిలను మహిళలు ముఖ్యమంత్రిని చేస్తారు
- సమ్మక్క-సారక్క వారసురాలు షర్మిల
- రాజకీయ పార్టీ పెట్టే హక్కు ఆమెకు ఉంది
తెలంగాణ యువతకు ఉద్యోగాల కోసం వైఎస్ షర్మిల హైదరాబాద్‌లోని ఇందిరాపార్కువద్ద 72 గంటల నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. షర్మిల చేపట్టిన దీక్షకు ప్రముఖ సామాజికవేత్త, రచయిత కంచె ఐలయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యతో పాటు పలువురు ప్రముఖులు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా కంచె ఐలయ్య మాట్లాడుతూ... కాకతీయ గడ్డ మీద రుద్రమదేవి తర్వాత మళ్లీ షర్మిలను చూస్తున్నానని ప్రశంసించారు. సమ్మక్క - సారక్క వారసురాలు షర్మిల అని కొనియాడారు. రాష్ట్ర మహిళలు షర్మిలను ముఖ్యమంత్రిని చేస్తారని ఆయన అనడం గమనార్హం. తెలంగాణ గడ్డపై రాజకీయ పార్టీ పెట్టే హక్కు ఆమెకు ఉందని చెప్పారు. వైఎస్సార్ హయాంలో 6000 ఆంగ్ల మాధ్యమ పాఠశాలలను ప్రారంభించారని తెలిపారు. పేదల చదువులకు వైఎస్సార్ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు.