Demonetised currency: తమిళనాడులో ఓ ఇంట్లో రూ.4.8 కోట్ల విలువైన పాతనోట్ల స్వాధీనం
![Demonetised currency notes worth about Rs 5 cr seized in Sivaganga](https://imgd.ap7am.com/thumbnail/cr-tn-60750e7557d53.jpg)
- ఫిజయోథెరపిస్ట్ ఇంట్లో లభ్యమైన నోట్లు
- అన్నీ రూ. 1000 నోట్లే
- దర్యాప్తు చేస్తున్నామన్న పోలీసులు
తమిళనాడులోని శివగంగ జిల్లా కలయర్‌కోలి ప్రాంతంలో ఓ ఇంట్లో దాచిపెట్టిన రూ. 4.8 కోట్ల విలువైన రద్దు చేసిన నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫిజియోథెరపిస్ట్ అరుల్ చిన్నప్పన్ ఇంట్లో వీటిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు అరుల్ ఇంటిపై దాడిచేసినట్టు చెప్పారు. సీజ్ చేసిన నోట్లన్నీ రద్దు అయిన రూ.1000 నోట్లేనని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.