Fine: తెలంగాణలో మాస్కు ధరించకపోతే రూ.1000 జరిమానా... అధికారిక ఉత్తర్వులు జారీ

If no mask there should be fine in Telangana

  • తెలంగాణలో ఉద్ధృతంగా కరోనా
  • కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం
  • బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరి చేస్తూ ఆదేశం
  • కఠినంగా అమలు చేయాలని కలెక్టర్లకు స్పష్టీకరణ

తెలంగాణలో నిత్యం వేల సంఖ్యలో కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటోంది. ఇకపై మాస్కు ధరించకపోతే రూ.1000 జరిమానాగా వడ్డిస్తారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్-2005, కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సర్కారు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

బహిరంగ ప్రదేశాల్లోనూ, ప్రయాణాల్లోనూ, పనిచేసే ప్రదేశాల్లోనూ మాస్కు తప్పనిసరి అని సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తాజా ఉత్తర్వులను కఠినంగా అమలు చేయాలంటూ జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులను ఆదేశించారు.

Fine
Mask
Telangana
Corona Virus
  • Loading...

More Telugu News