Rashmika Mandanna: 'ఒకటనుకుంటే మరొకటి అయ్యా'నంటున్న రష్మిక

Rashmika says she wanted to become a teacher

  • కాలేజీ రోజుల్లో టీచర్ అవ్వాలనుకున్న రష్మిక  
  • డిగ్రీలో ఇంగ్లిష్ లిటరేచర్, సైకాలజీ సబ్జెక్టులు
  • అనుకోకుండా మోడలింగ్.. తర్వాత సినిమాలు   
  • అంతా ఆశ్చర్యంగా వుందంటున్న ముద్దుగుమ్మ 

చదువుకునే సమయంలో ప్రతి ఒక్కరూ తమ కెరియర్ గురించి రకరకాలుగా కలలు కంటూవుంటారు. ఇంజనీర్ అవ్వాలనీ.. డాక్టర్ అవ్వాలనీ.. ఇలా రకరకాలుగా అనుకుంటూ వుంటారు. అందుకు తగ్గా ప్రణాళికతో ముందడుగు వేస్తుంటారు. అయితే, కొందరి విషయంలో మాత్రం అనుకున్నది ఒకటైతే.. జరిగేది మరొకటి అవుతుంది. అందుకు తన జీవితమే నిదర్శనం అంటోంది అందాలభామ, బిజీ కథానాయిక రష్మిక.

"మైసూర్ లో కాలేజీలో చదువుకునేటప్పుడు టీచింగ్ వృత్తిలో సెటిల్ అవ్వాలనుకునే దానిని. ఎందుకో తెలియదు, టీచింగ్ అంటే మహా ఇష్టం.. అందుకే, డిగ్రీలో ఇంగ్లిష్  లిటరేచర్ తో పాటు సైకాలజీ సబ్జెక్ట్ కూడా తీసుకున్నాను. అయితే, భగవంతుడు నా కెరియర్ ని మరోలా రాసిపెట్టాడు. అనుకోకుండా మోడలింగ్ లో ప్రవేశించాను.. తర్వాత ఇదిగో.. ఇలా సినిమాలలోకి వచ్చేశాను. అందుకే, ఇదంతా చూస్తుంటే ఏమిటో ఆశ్చర్యంగా ఉంటుంది" అని చెప్పింది రష్మిక.

ప్రస్తుతం ఈ చిన్నది తెలుగులో అల్లు అర్జున్ సరసన 'పుష్ప' సినిమాలోనూ, శర్వానంద్ కు జోడీగా 'ఆడాళ్లూ మీకు జోహార్లు' చిత్రంలోనూ నటిస్తోంది. ఇక హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం 'మిషన్ మజ్ను', 'గుడ్ బై' చిత్రాలలో నటిస్తోంది. ఇదిలావుంచితే, తొలిసారిగా రష్మిక తమిళంలో 'సుల్తాన్' సినిమాలో నటించింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి.

Rashmika Mandanna
Pushpa
MIssion Majnu
Goodbye
  • Loading...

More Telugu News