vishnu varthan reddy: సినిమా ద్వారా మీరు ప‌వ‌న్ క‌ల్యాణ్ కు షాకిస్తే.. తిరుపతిలో ప్రజలు మీకు షాకిస్తారు: విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి

vishnu varthan slams ycp

  • టికెట్ ధ‌ర‌ల పెంపు నిలుపుద‌ల‌పై ఆగ్ర‌హం
  • ఏపీలో వకీల్ సాబ్ సినిమా టికెట్ వ్యవహారం కాదు నడుస్తోన్నది
  • తిరుపతి ఎంపీ టికెట్ ఎన్నికల వ్యవహరం న‌డుస్తోంది

తిరుప‌తి ఉప ఎన్నిక ముందు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా విడుద‌ల కావ‌డంతో ఏపీలో ఈ విష‌యంపై కూడా రాజకీయ దుమారం రేగుతోంది. వ‌కీల్ సాబ్ బెనిఫిట్ షోల టిక్కెట్లు ధ‌ర‌లు పెర‌గ‌కుండా ఏపీ స‌ర్కారు అడ్డుకోవ‌డంపై బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు. రాజ‌కీయ కార‌ణాల దృష్ట్యానే ఇటువంటి క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతున్నార‌ని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కూడా స్పందించారు.

'ఏపీలో వకీల్ సాబ్ సినిమా టికెట్ వ్యవహారం కాదు నడుస్తోన్నది, తిరుపతి ఎంపీ టికెట్ ఎన్నికల వ్యవహారం. రాజకీయ అంశంగా వకీల్‌సాబ్‌కు సినిమా ద్వారా ప‌వ‌న్ క‌ల్యాణ్ కు షాకిస్తే... 17న తిరుపతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు, ప‌వ‌న్ అభిమానులు షాక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి' అని ఆయ‌న ట్వీట్ చేశారు.

కాగా, ఇత‌ర‌ కొత్త సినిమాలలాగే వ‌కీల్ సాబ్‌కు కూడా వారం రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు ఉంటుంద‌ని భావించిన‌ ఎగ్జిబిటర్లు.. ఆ అవ‌కాశం రాక‌పోవ‌డంతో నిన్న‌ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

vishnu varthan reddy
BJP
YSRCP
Vakeel Saab
  • Loading...

More Telugu News