Sasikala: ఓటరు జాబితా నుంచి శశికళ పేరు మాయం.. ఓటేసే అవకాశాన్ని కోల్పోయిన చిన్నమ్మ!

Sasikala Name Missing In Voter List

  • అక్రమాస్తుల కేసులో 2017లో జైలుకు వెళ్లిన శశికళ
  • 30 ఏళ్లుగా థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో ఓటు  
  • శశికళ జైలుకు వెళ్లిన తర్వాత ఓటు హక్కు తొలగింపు

అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైన జయలలిత నెచ్చెలి శశికళ పేరు ఓటరు జాబితా నుంచి గల్లంతైంది. రాష్ట్రంలో నేడు ఎన్నికలు ప్రారంభం కాగా, ఓటరు జాబితాలో పేరు లేని కారణంగా శశికళ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కోల్పోయారు. మూడు దశాబ్దాలుగా పోయెస్ గార్డెన్ చిరునామాలోనే ఉంటున్న శశికళ థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో ఓటు వేస్తున్నారు.

అయితే, అక్రమాస్తుల కేసులో 2017లో జైలుకు వెళ్లిన తర్వాత జయలలిత నివాసాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో అక్కడే నివసిస్తున్న శశికళ, ఇళవరసి సహా 19 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి అధికారులు తొలగించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తమకు తిరిగి ఓటు హక్కు కల్పించాలని కోరుతూ శశికళ, ఇళవరసి ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. మరోవైపు, శశికళ పేరును జాబితాలో చేర్చకపోవడంపై థౌజండ్ లైట్స్ ఏఎంఎంకే అభ్యర్థి వైద్యనాథన్ నిన్న ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు.

  • Loading...

More Telugu News